Home Page SliderInternational

జొమాటోలో ప్లాస్టిక్ ప్యాకింగ్‌పై సీఈఓ కామెంట్స్

Share with

ఆహారాన్ని ప్లాస్టిక్, ప్యాలిథిన్ ప్యాకెట్లలో ప్యాకింగ్ చేయడంపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. తమ సంస్థ నాన్ ప్లాస్టిక్ వైపుగా మారేందుకు కృషి చేస్తుందని మాట ఇచ్చారు. విషయమేమిటంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల లైఫ్ స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఫుడ్ డెలివరీ యాప్‌లను ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెట్టారు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్స్‌లలో ప్యాక్ చేయడం వల్ల ఆహారంలో ప్లాస్టిక్ కరిగి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని పేర్కొన్నారు. దీని బదులు బయోడిగ్రేడబుల్ బాక్స్‌లలో ఫుడ్ డెలివరీలు అందించేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. దీనిపై జొమాటో సీఈఓ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇకపై సురక్షితమైన ఆహార ప్యాకేజీలను అందించే రెస్టారెంట్లను హైలైట్ చేస్తాం అని పేర్కొన్నారు.