Home Page SliderNational

సలార్ టీజర్‌తో షేక్ అవుతోన్న యూట్యూబ్

Share with

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా “సలార్”.కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సలార్ సినిమా టీజర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా టీజర్ విడుదలైన 52 గంటల్లోనే యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాకుండా 1.9 మిలియన్ లైక్స్ సాధించి ఇండియాలో ట్రెండింగ్ నెం.1లో కొనసాగుతోంది. దీంతో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి టీజర్‌గా సలార్ రికార్డు సృష్టించిందని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్,పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.