Home Page SliderInternational

ICC ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న యశస్వి

Share with

క్రికెట్‌లో యువకెరటంలా యశస్వి జైస్వాల్ దూసుకొస్తున్నాడు. కాగా ఇటీవల జరిగిన IPLలో ఈ యంగ్ క్రికెటర్ అదరగొట్టాడు. దీంతో యశస్వి జైస్వాల్ టీమిండియాలో చోటు సంపాదించాడు.అయితే ఇటీవల టీమిండియాకు వెస్టీండీస్‌తో జరిగిన  టెస్ట్‌లో కూడా యశస్వి కెరటంలా విరుచుకుపడి తొలిసారి ICC ర్యాకింగ్స్‌లోకి ప్రవేశించి 73 స్థానాన్ని దక్కించుకున్నాడు.  కాగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ,యశస్వి సెంచరీలతో చెలరేగారు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మేరకు  టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ 10వ స్థానం,పంత్ 11,విరాట్  కోహ్లీ 14 వ స్థానంలోనే కొనసాగుతున్నారు. కాగా ఆస్ట్రేలియా  క్రికెటర్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచారు.