Home Page SliderTelangana

యాదాద్రి భువనగిరి: బిజెపి అభ్యర్థి పడాల శ్రీనివాస్ తరపున ప్రచారంలో ఈటల

Share with

యాదాద్రి భువనగిరి: బిజెపి అభ్యర్థి పడాల శ్రీనివాస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.

యాదగిరిగుట్టలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ: ఎస్సీలు 30 సంవత్సరాలుగా ఏ బి సి డి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నారు. అన్ని పార్టీలు వారిని రాజకీయంగా వాడుకున్నాయి తప్ప పరిష్కారం చూపించలేదు. నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదిగ నా తమ్ముడు అని చెప్పారు. వారి సమస్యను పరిష్కరించిన పార్టీ బిజెపి.

బీసీలందరూ మాకు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం అని అంబేద్కర్ గారు  చెప్పారు. బీసీలు ముఖ్యమంత్రి అయ్యేది ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే.

పడాల శ్రీనివాస్‌కి ఓటు వేస్తే ఆయనకు ఓటేసినట్లు, ముఖ్యమంత్రి అభ్యర్థికి ఓటు వేసినట్టు. ప్రజాగర్భంలో పుట్టిన ఆలోచన విజయాన్ని ముద్దాడుతుంది. ఓట్లు మనవి మనకు వేసుకోవాలి. లేక లేక బీసీ వర్గాలకు అధికారం ఇస్తామని బిజెపి ప్రకటించింది. నిండు మనసుతో ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ రైల్వే ప్లాట్‌ఫాం మీద చాయ్ అమ్ముకొని పెరిగారు. వారి అమ్మ నలుగురు ఇళ్లల్లో పనిచేసి మోదీని పోషించింది. అలాంటి వ్యక్తి ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిన బిడ్డ. అగ్రరాజ్యాల ప్రెసిడెంట్లతో సమానంగా గౌరవం పొందుతున్న వ్యక్తి. ఆకలి తెలిసిన బిడ్డ కాబట్టి ఆ వర్గాలకు రాజ్యాధికారం అందించాలని భావిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఆరు హామీలు ఇవ్వాలని చెప్పారు.

• వరి ధాన్యానికి మూడు వేల ఒక వంద రూపాయల  చొప్పున మద్దతు ధర ఇవ్వమని చెప్పారు. దీనివల్ల  ఒక్కో రైతుకి ఎకరానికి 20 వేల రూపాయల లాభం  చేకూరుతుంది. ఎకరానికి ఐదు వేలు ఇచ్చే కేసీఆర్‌కి  ఓటు వేస్తావా 20 వేలు ఇచ్చే మోడీకి ఓటు వేస్తావా ఆలోచన చేయండి.

• అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్లరేషన్ కార్డులు  ఇవ్వమన్నారు. కేసీఆర్ బియ్యం బందు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్న ఐదు కేజీల బియ్యం మోడీ గారు ఇస్తున్నవే.

• నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాము.

• ఒక శాతం వడ్డీకి మహిళలకు రుణాలు అందిస్తాము.

• ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ అందిస్తాం.

• ఉచిత వైద్యం, విద్య అందిస్తాం.

పడాల శ్రీనివాస్ ఈ గడ్డమీద గెలుస్తానని చెప్తున్న దమ్మున్న వ్యక్తి.

కెసిఆర్ డబ్బులను మద్యాన్ని నమ్ముకుంటే మనం ధర్మాన్ని ప్రజలను నమ్ముకున్నాము. అంతిమ విజయం ధర్మానది, న్యాయానిదే. హుజురాబాద్‌లో ఏం జరిగిందో రేపు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. టిడిపి ఒక  కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒకే సామాజికవర్గానికి అవకాశాలు ఇచ్చింది.

భారత రాష్ట్ర సమితి తొలి ముఖ్యమంత్రి దళితుడి చేస్తా అని చెప్పి మోసం చేశారు. ఆ పార్టీ ఉన్నంత కాలం అయితే కేసిఆర్ లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇంకా కాకపోతే ఆయన మనుమడు ముఖ్యమంత్రి అవుతారు తప్ప ఏ కులమైన ఏ సామాజిక వర్గం కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.

నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నన్ను పక్కకు పిలుచుకుని మాట్లాడారు. ఏం చేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. ఈ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు చెప్పమని అడిగారు. రాజ్యాధికారి కోసం పోట్లాడుతున్న వర్గాలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వాలని కోరితే.. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ధైర్యంగా ప్రకటించారు.

తనకు ఇదే ఎల్బీ స్టేడియంలో ఆశీర్వాదం దొరికిన తర్వాతనే ప్రధానమంత్రిని అయ్యాను.. మీరు కూడా బిజెపిని ఆశీర్వదించండి ఒక  బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా చెప్పారు. దీనిమీద రాహుల్ గాంధీ వెకిలిగా మాట్లాడుతున్నారు. రెండు శాతం ఓట్లు ఉన్నవారు బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తారు అని. మా ఓటు మాకు వేసుకుంటే మీ డిపాజిట్లు గల్లంతు అవుతాయి బిడ్డ. నా డిక్షనరీలో నాట్ పాసిబుల్ అనేది లేదు. కెసిఆర్ చాలామందికి బీఫాంలు ఇచ్చి ఉండవచ్చు 2004 లో 52 మందికి బి ఫాంలు ఇస్తే 26 మంది గెలిచారు. 2009లో 45 మందికి బి ఫాం ఇస్తే  గెలిచింది పట్టుమని పదిమంది. అంటే అర్థం పార్టీ బీఫామ్ ఇచ్చినా ప్రజలు ఆశీర్వదించకుంటే గెలవరు. ఆ ఆశీర్వాదం నాకు దక్కింది. హుజురాబాద్ తీర్పు ఒక చరిత్ర. డబ్బు సంచులకు, మద్యం సీసాలకు, గజ కర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలకు లొంగేది తెలంగాణ కాదు. గిరిగీసి కొట్లాడేది తెలంగాణ అని నిరూపించింది. హుజురాబాద్ కెసిఆర్ చెంప చెళ్లుమనిపించింది.