Home Page SliderTelangana

వామ్మో.. కిలో 100 రూపాయలా..!

Share with

కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏదికొందామన్నా రూ.వంద పెట్టాల్సిందే. కిలో కొనేవారు కోటీశ్వరులన్నట్టుగా పరిస్థితి మారింది. పట్టణాల్లోనే కాదు.. పల్లెటూళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదివరకు రూ.200 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు సంచీ నిండా వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండడం లేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో అన్ని కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉండేవి. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత కారణంగా వీటి ధరలు పెరిగాయని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ధరలు చూసి బెంబేలెత్తుతున్న మధ్యతరగతి కుటుంబీకులు. ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్న జనం.