InternationalNational

మహిళా ఖైదీల క్యాట్‌వాక్ సూపర్

Share with

డిజైనర్లు తాము డిజైన్ చేసిన వస్త్రాలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఫ్యాషన్ షోలను నిర్వహించడం పరిపాటే. ఇదే బాటలో తమకు మాత్రం ఏం తక్కువ అనుకున్నారు బొలీవియాలోని ఓ జైలులో మహిళా ఖైదీలు. తాము తయారుచేసుకున్న వస్త్రాలను మార్కెట్ చేసుకోవడానికి తామే స్వయంగా మోడలింగ్ చేస్తున్నారు. మోడల్స్‌కి ఏమాత్రం తగ్గకుండా క్యాట్ వాక్ నిర్వహించారు. ఒయ్యారాల నడకలతో హొయలు పోయారు.  బొలీవియా మహిళా దినోత్సవం కారణంగా మహిళా ఖైదీలకు జైలు అధికారులు క్యాట్ వాక్ ఏర్పాటు చేసారు. వీరి ప్రదర్శన ద్వారా వచ్చిన సొమ్మును వారికే ఇస్తున్నారు. 15 మంది మహిళా ఖైదీలు కుట్టుపనిలో శిక్షణ ఇచ్చారు. వీరంతా టైలరింగ్ నేర్చుకుని దుస్తులు తయారుచేసారు. వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును వారి పిల్లల పెంపకానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అక్కడి ప్రఖ్యాత రచయిత ‘అడేలాల్ జొమోనియా’  జయంతిని పునస్కరించుకుని జాతీయ మహిళా దినోత్సవాన్ని  అక్టోబర్ 11 న ప్రతిఏటా నిర్వహిస్తారు.