Home Page SliderNational

సమంత త్వరగా కోలుకోవాలి

Share with

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతకొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ అని తెలుస్తోంది. కాగా దీనికి సమంత చికిత్స తీసుకుంటూ..నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో సమంత తాజాగా మయోసైటిస్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటో మయోసైటిస్ చికిత్సలో భాగంగా హైపర్‌బారిక్ థెరపీకి సంబంధించిందని సమంత వెల్లడించారు. ఈ చికిత్స తీసుకోవడం వల్ల శరీరంలో పాడైన టిష్యూలు మెరుగపడతాయని ఆమె పేర్కొన్నారు.దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా ఈ ఫోటో చూసిన సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సామ్ మీరు త్వరగా కోలుకోవాలి అని కామెంట్స్ పెడుతున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ..పలు సినిమాల్లో నటించారు. కాగా ఆమె నటించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించింది. మరోవైపు హాలీవుడ్ వెబ్‌సిరీస్ సిటాడెల్‌లో కూడా సమంత మెరిశారు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది.