Andhra PradeshHome Page Slider

“గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి-ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి”…అంబటి

Share with

ఏపీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. నాడ్యాన్స్‌లను విమర్శించే స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడన్నారు. నేను గెలిచి, మంత్రినయి సంక్రాంతికి వేసిన డ్యాన్స్- గెలిచినోడి డ్యాన్స్ అని, మీరు చంద్రబాబు వద్ద ప్యాకేజ్ తీసుకుని చేసిన డ్యాన్స్ కాళరాత్రి అన్నారు. పవన్ రాజకీయాలలో తమను ఎదుర్కోలేక ఇలా సినిమాలను వాడుకుంటున్నారన్నారు.  ‘బ్రో’ సినిమాను ఎవరో డబ్బు పెట్టి తీస్తే, ఆ సినిమాలో డబ్బు తీసుకుని నటిస్తూ పవన్ కళ్యాణ్ తన పాత్రను ‘శ్యాంబాబు’ అనే పేరుతో సృష్టించి, అతడితో డ్యాన్సులు చేయించి ‘శునకానందం’ పొందుతున్నాడని విమర్శించారు. దమ్ముంటే గెలిచి డ్యాన్స్ చేసి, చూపించమన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారన్నారు. ఇది కేంద్రప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. 2016లో ఈప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం తీసుకుందని, కానీ 2014 రేట్ల ప్రకారం ఎందుకు అంగీకరించారని, కేంద్రప్రభుత్వంతో లాలూచీ అయి, కమీషన్లు కొట్టేసే ఉద్దేశంతోనే ఇలాంటి పని చేశారని మండిపడ్డారు. 2018లో పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు ఎందుకు పోలవరాన్ని పూర్తి చేయలేదని ప్రశ్నించారు.  టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్ కూలిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని వైసీపీ కాదు, చంద్రబాబేనని విమర్శించారు అంబటి రాంబాబు.