Andhra PradeshHome Page Slider

‘పార్టీలో పని చేస్తారా..లేక తప్పుకుంటారా’..చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Share with

ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని TDP పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు పార్టీలో ‘పని చేస్తారా లేక తప్పుకుంటారా’ అంటూ  హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతూనే మరోవైపు పార్టీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చంద్రబాబు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ సంకల్పంతో కఠిన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు వార్నింగులు ఇస్తున్నారు. తాజాగా జరిగిన సమీక్షలు సమావేశాల్లో చంద్రబాబు పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ కోసం పనిచేయలేని వారు ఉంటే తప్పుకోవాలని  ప్రత్యామ్నాయం చూసుకుంటామని తేల్చి చెప్పడంతో నేతలు షాక్ అయ్యారు. పనిచేస్తానని చెబుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని కఠినమైన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు చంద్రబాబు ఇస్తున్న సీరియస్ వార్నింగ్‌తో మళ్లీ నియోజకవర్గాల్లో బిజీ అయ్యే పనిలో ఉన్నారు. ఇంకొక వైపు రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియక నేతలు తికమక పడుతున్నారు. పార్టీ నేతల పనితీరుపై కొంత అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం ద్వితీయశ్రేణి నాయకత్వంపై ఫోకస్ పెట్టింది. పనితీరు సరిగ్గా లేని నేతలను పక్కనపెట్టి ద్వితీయశ్రేణి నేతలకు అక్కడ అవకాశం కల్పించాలని యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.