Home Page SliderInternational

యూరోప్‌లో ఎక్స్ (X) బంద్ చేయనున్నారా..ఎలాన్ మస్క్ అసహనం..

Share with

ఐరోపా సమాఖ్యలో ఇటీవల తీసుకువచ్చిన డిజిటల్ సర్వీసెస్ యాక్టు నిబంధనలపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సోషల్ మీడియాను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే తన మైక్రోబ్లాగింగ్ యాప్ సేవలకు స్వస్తి పలకడానికి మస్క్ సిద్ధపడుతున్నారని సమాచారం. దీనితో సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐరోపా దేశాలలో యూజర్లకు దీనిని అందుబాటులో లేకుండా చేయడం, లేదా వినియోగించకుండా బ్లాక్ చేయడం వంటి అంశాలపై ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం. ఇటీవల అక్కడ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్‌ను తీసుకువచ్చింది యూరోపియన్ యూనియన్. హానికరమైన కంటెంటును వ్యాప్తి చెందకుండా నిరోధించడం, కట్టడి చేయడం, నియంత్రణ సంస్థలతో, పరిశోధకులతో అంతర్గత సమాచారాన్ని పంచుకోవడాన్ని ఈ యాక్ట్ నిషేధిస్తోంది. దీనతో  టెక్ కంపెనీల నుండి వ్యతిరేకత వస్తోంది. ఆన్‌లైన్ కంటెంటు నిబంధనలుకు అనుగుణంగా ఎక్స్ వేదికపై తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయమని మస్క్‌కు యూరోపియన్ యూనియన్ నుండి సమాచారం అందడంతో ఎక్స్ సేవలకు ముగింపు పలికేందుకు మస్క్ ఆలోచిస్తున్నారు.