Home Page SliderTelangana

ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారనున్నారా?

Share with

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాగా దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు. తన ప్రయాణం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే సాగుతుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.