Home Page SliderNational

రజినీకాంత్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా?

Share with

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన నటన,స్టైల్‌తో సినీ అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాచిందుకున్నారు. కాగా ఈ తమిళ తలైవా ప్రతి సినిమాలో తన నటనతోను,మేనరిజంతోను అభిమానుల్ని ఆకట్టుకుంటారు. రజినీకాంత్ 70 ఏళ్ల వయస్సులోను కుర్ర హీరోలకు గట్టి పోటి ఇస్తూ..నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే రజినీకాంత్ ఇప్పటివరకు 170 కి పైగా సినిమాల్లో నటించారు. ఇటీవల కాలంలో రజినీకాంత్ త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారు అనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఇది కాస్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు సోషల్ మీడియా కూడా దీని గురించి కోడై కూస్తుంది. దీనికి ప్రధాన కారణం తమిళ దర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్యలని తెలుస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మిస్కిన్ రజినీకాంత్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. అంతేకాకుండా ఇదే  రజినీకాంత్ చివరి సినిమా అని కూడా అన్నారు. దీంతో మిస్కిన్ వ్యాఖ్యలు కాస్త సినీరంగంలో చర్చనీయాంశమైయ్యాయి. మరోవైపు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ..తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోరంటున్నారు. మరికొందరు మాత్రం రజినీకాంత్‌పై ఇలాంటి ప్రచారాలు ఆపండీ అని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సివుంది.