Home Page SliderTelangana

జూపల్లి, పొంగులేటిలు బీజేపీలో చేరతారా? కాంగ్రెస్‌లోనా?

Share with

జూపల్లి, పొంగులేటి నిన్న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్‌ను,  పార్టీని విమర్శించడంతో తక్షణమే వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది బీఆర్‌ఎస్. వీరిద్దరూ ఏ పార్టీలో చేరతారనే అంశంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తి అని తెలుస్తోంది.  గతంలో వైయస్సార్‌కు దగ్గరగా ఉన్న అతను, అనంతరం వైసీపీలో చేరడం, తెలంగాణా, ఆంధ్ర విడిపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికీ అతడింట్లో వైయస్సార్ ఫొటో పెట్టుకున్నారు. దీనితో అతను కాంగ్రెస్‌లో చేరతారా లేదా సొంతపార్టీ పెడతారా అనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక పొంగులేటిని బీజేపీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌తో సహా అధిక సంఖ్యలో ఈయన కుమారుని వివాహానికి హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా సస్పెన్షన్‌కు గురవ్వడంతో బీజేపీ నాయకత్వం ఆయనను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓపక్క కాంగ్రెస్‌లో కూడా చేరే అవకాశాలున్నాయి. ఖమ్మంలో అధికంగా కాంగ్రెస్ ప్రాధాన్యం ఉండడంతో కాంగ్రెస్‌లో కూడా చేరే అవకాశాలున్నాయి.