Home Page SliderInternational

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..చరిత్ర సృష్టించనుందా..?

Share with

T20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఫైనల్‌ మ్యాచ్‌కు దూసుకెళ్లింది. కాగా ఫైనల్‌లో టీమ్‌ఇండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ నెల 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రాత్రి 8 గంటలకు ఇండియా Vs సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ రెండు జట్లు టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో గెలిచేది ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే T20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ.. ఫైనల్‌లో అడుగుపెట్టింది. కాగా ఈ T20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ లాంటి జట్లపై ప్రతీకారం తీర్చుకుని మరీ 10 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇటీవల వన్డే వరల్డ్ కప్ చేజారడంతో పొట్టి ప్రపంచకప్ ఎలాగైనా సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ మేరకు ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. టీమ్ ఇండియా ఈసారి T20 వరల్డ్ కప్‌ను గెలిచినట్లైతే 10 ఏళ్ల తర్వాత టైటిల్‌ను దక్కించుకొని చరిత్ర సృష్టించనుంది. కాగా ఈ క్షణం కోసం ఎన్నో కోట్లమంది భారతీయులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.