Home Page SliderTelangana

తెలంగాణ కోసం ఎందాకైనా వెళ్తా.. ఏమైనా చేస్తా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Share with

నూతనంగా తెలంగాణ లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్రమోదీ గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీపదేవిధంగా చేసారని అందుకే ప్రజలు నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చారన్నారు. నన్ను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాలు అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తానని చెప్పారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజవర్గానికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు. సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్ లు పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక నాయకులు కార్యకర్తలు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తార్నాకలోని విజయపురి కాలనీ మర్రి కృష్ణారెడ్డి హాల్లో జరిగిన ఈ కార్యక్రమం లో కిషన్ రెడ్డి మాట్లాడారు.

నా మీద నమ్మకం ఉంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నా శాఖకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. 2029లో తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే బిజెపి శ్రేణులు కార్యకర్తలు అందరూ అదిశగా పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, నియోజవర్గాలు మారుతాయని, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు పెరుగుతాయని, మహిళా రిజర్వేషన్ తో మహిళకు అవకాశాలు ఉంటాయని, మహిళా నియోజకవర్గలో మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టడం ఖాయమన్న కిషన్ రెడ్డి, మహిలకు యువకులకు రైతులకు నిరుద్యోగులకు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. BRS పని అయిపోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేశారేశారన్నారు. సీఎం కావాలన్న తన కలలు తలకిందుల కావడంతో ఆ ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనా ను అహంకారాన్ని ఓడించారన్నారు. ఈ రెండు పార్టీలపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు.

ఈరోజు మోదీ ప్రభుత్వం పొదుపు సంఘాలకు అప్పులిచ్చి ఆదుకుంటుందన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసే విధంగా పని చేయాలన్నారు. సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో రెండోసారి గెలిచిన నాకు మోదీ, బొగ్గు గనుల శాఖ మంత్రిగా చేసారని, ఈ సందర్భంగా మీ అందరి తరపున ధన్యవాదములని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు మంత్రి పదవులు ఇచ్చారని, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. సికింద్రాబాద్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా పని చేస్తానన్నారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇల్లు నిర్మిస్తే అంత వాటా తెచ్చే బాధ్యత తనదేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసిన నిధులను తెచ్చే బాధ్యత కూడా నాదేనన్నారు.