Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా?

Share with

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఏపీలోని టీడీపీ పార్టీ నాయకులు,నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కాగా తనపై వేసిన ఈ అవినీతి ఆరోపణలను తిప్పి కొడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. కాగా ఏపీ హైకోర్టు కొట్టివేసిన క్వాష్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బసు,జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.