Home Page SliderInternational

ప్రాణం తీసిన చేపల కూర

Share with

మలేషియాకు చెందిన భార్య,భర్తలు ఇద్దరు చేపల కూర తిన్నారు. తిన్న తర్వాత భార్యా చనిపోయింది. కాగా భర్త హస్పటల్‌లో కోమాలో ఉన్నారు.  అయితే చేపల కూర తిని ఎలా చనిపోయారని ఆశ్చర్యాపోతున్నారా? మరి వీళ్లు తిన్నది మామూలు చేప కాదు. అదేంటంటే పఫర్ చేప. కాగా భర్త గ్వాన్ (84) దీనిని తీసుకువచ్చి తన భార్య లిమ్ సీవ్‌(83)కు ఇచ్చారు. ఆమె దానిని తీసుకుని కూర చేసింది. కాగా భార్య,భర్తలు ఇద్దరు ఆ కూర తిన్నారు. తిన్న అనంతరం వారికి ఒంట్లో వణుకు పుట్టింది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తింది. ఇది గమనించిన వారి కుమారుడు వారిని వెంటనే హస్పిటల్‌కు తరలించాడు. హస్పిటల్‌లో చికిత్స పొందుతూ..భార్య కన్నుమూసింది. కాగా భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే వారు వండిన పఫర్ చేపల్లో టెట్రోడోటాక్సిన్ ,సాక్సి టాక్సిన్ అనే ప్రాణాంతకమైన విషపూరితాలు ఉంటాయని ..ప్రత్యేక శిక్షణతోనే వాటిని వండాలని అధికారులు వెల్లడించారు.