Home Page SliderNational

“నా ప్రసంగం లేనప్పుడు నేనెందుకు రావాలి”… అశోక్ గెహ్లాత్

Share with

ప్రధాని సభలో తన ప్రసంగం తొలగించడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ చిన్నబుచ్చుకున్నారు. ‘నా ప్రసంగం లేనప్పుడు నేనెందుకు రావాలంటూ’ ప్రశ్నించారు. ‘నేను ప్రదానిని నేరుగా ఆహ్వానించడం కుదరదని, ట్విటర్‌లోనే ఆహ్వానం పలుకుతున్నానని’ పేర్కొన్నారు. తన మూడు నిముషాల ప్రసంగాన్ని ప్రధాని కార్యాలయం తొలగించింది. ఆయన తన ప్రసంగంలో చెప్పదల్చుకున్న డిమాండ్లను కూడా ట్విటర్ ద్వారానే మీ ముందుచుతున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల్లో ఏడోసారి రాజస్థాన్‌కు ప్రధాని వస్తున్నారని, కానీ రాష్ట్రప్రభుత్వ డిమాండ్లేవీ నెరవేర్చడం లేదని విమర్శలు కురిపించారు. రాజస్థాన్‌లోని సీకర్ పట్టణంలో ప్రధాని మోదీ గురువారం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1.25 లక్షల కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని కూడా జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అశోక్ గెహ్లాత్ విమర్శలకు ప్రధాని కార్యాలయం ధీటుగా స్పందించింది. ప్రధాని కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించామని, కానీ మీ కార్యాలయం నుండి తమరు రాలేరంటూ సమాచారం వచ్చిందని వారు ట్విటర్లో పేర్కొన్నారు. అంతేకాక మీకు సమయం ఇచ్చామని, ప్రసంగానికి కూడా సమయం కేటాయించామని, శిలాఫలకాలపై కూడా మీ పేరును రాయించామని తెలియజేశారు. గెహ్లాత్‌ను సాదరంగా ప్రధాని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు పీఎంవో ట్విటర్‌లో ప్రకటించారు.