Home Page SliderNational

ఈ రోజు IPL మ్యాచ్‌లో గెలిచేదెవరు?ఇంటికి వెళ్లేదెవరు?

Share with

ఇప్పటివరకు ఎంతో ఉత్కంఠగా సాగిన IPL పోరు తుది దశకు చేరుకుంది. కాగా మరో రెండు రోజుల్లో IPL పైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో CSK టీమ్ తొలి క్వాలిఫయింగ్ రౌండ్‌లో అత్యధిక పరుగులు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా మొదటి క్వాలిఫయింగ్ రౌండ్‌లో CSK చేతిలో ఓటమి పాలయిన GTకి, LSG పై పైచేయి సాధించిన MI టీమ్‌కు ఫైనల్‌లో ప్రవేశించేందుకు ఇవాళ క్వాలిఫయింగ్-2 మ్యాచ్ జరగనుంది. అయితే GT VS MI మధ్య జరిగే ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.  కాగా IPLలో ఇప్పటికే 5 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది ముంబై టీమ్. మరోవైపు గత సీజన్లో ఫైనల్ విన్నర్‌గా నిలిచింది గుజరాత్ టీమ్. మరి ఈ రెండు జట్టుల్లో ఏ టీమ్ ఫైనల్‌కు చేరి ధోని సేనతో తలపడుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.  అయితే MI ఫ్యాన్స్ ఏమో ఈ మ్యాచ్‌లో MI గెలుస్తుందని,GT ఫ్యాన్స్ ఏమో GTయే గెలుస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌పై భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్‌లో CSK తో ఎవరు తలపడనున్నారో తెలుసుకోవాలంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ చూడాల్సిందే.అంతేకాకుండా ఈ మ్యాచ్ జరగబోయే నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్‌ అవుతున్నాయి.