Home Page SliderTelangana

సిర్పూర్ ఖిల్లాలో విజేత ఎవరు?

Share with

సిర్పూర్ నియోజకవర్గం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే విశేషమైన పేరుంది. సిర్పూర్‌ను గతంలో సూర్యపురం అని పిలిచేవారు. గోండు రాజు బల్లాల ఈ ప్రాంతాన్ని పాలించాడు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ క్రమం చూసుకున్నా ఈ నియోజకవర్గం నెంబర్ 1గా ఉంటుంది. ఇక్కడ్నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలోనూ గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఇక్కడ్నుంచి విజయం సాధించి, నియోజకవర్గంలో మాంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ బీఎస్పీ తరపున కోనప్ప ఇక్కడ విజయం సాధించారు. ఇక్కడ గెలిచినవారు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు, లేదా అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తారని బలమైన విశ్వాసం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున కోనేరు కోనప్ప బంధువు మేనల్లుడు, రావి శ్రీనివాస్ బరిలో నిలుస్తోండగా, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు రేసులో ఉన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ్నుంచి పోటీ చేస్తోండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నియమించి సత్తా చాటాలని చూస్తున్న ప్రవీణ్ కుమార్ సిర్పూర్‌లో తనను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 293 బూత్‎లు ఉండగా ఇక్కడ పురుష ఓటర్లు 1,11,924, స్త్రీలు 1,11,039, ట్రాన్స్‌జెండర్లు 10 మొత్తం ఓటర్లు 2,22,973 ఉన్నారు. ఇక కులాల వారీగా చూస్తే సిర్పూర్ నియోజకవర్గంలో నేతకాని, గిరిజనులది పై చేయి. వీరే జనాభాలో అత్యధికం. రెండు సామాజికవర్గాలు 15 శాతానికి పైగా ఓట్లు కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ప్రముఖంగా మున్నూరుకాపులంటారు. సుమారు 10 శాతం వరకు మున్నూరుకాపులుండగా, అగ్రవర్ణాలు 10 శాతానికిపైగా ఉన్నారు. మాల, మాదిగలు 16 శాతం ఉండగా… 6 శాతం వరకు ముస్లింలు ఇక్కడ ఉన్నారు. మాదిగ, బెస్త, వైశ్యులు సుమారుగా ఐదు శాతం మేర ఉన్నారు. ఇతరులు 30 శాతం వరకు ఉన్నారు.