Andhra PradeshNews Alert

సుప్రీం సూటి ప్రశ్న- ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలి?

Share with

స్వర్గీయ ఎన్టీఆర్ భార్య, వైసీపీ నేత  లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  ఆమెకు ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల నుండే చంద్రబాబు నాయుడిపై ఎంతో కోపం ఉండేది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాసే నెపంతో ఆయనకు దగ్గరై, వివాహం కూడా చేసుకుంది. ఎన్టీఆర్ ఆస్తులపై, తెలుగుదేశం పార్టీపై ఆమె ఆధిపత్యాన్ని సహించలేని ఎన్టీఆర్ సంతానం వారిని దూరం పెట్టారు. తర్వాతకాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హస్తగతం కావడం మనకందరకూ తెలిసిందే.

ఎలాగైనా పార్టీపై పట్టు సాధించాలన్న ఆమె ఆశలు ఎన్టీఆర్ మరణంతో అడియాసలయ్యాయి. 2005లో చంద్రబాబు అక్రమంగా ఆస్తులు సంపాదించారంటూ ఏసీబీకి ఫిర్యాదు చేయగా, చంద్రబాబు అప్పుడు హైకోర్టు నుండి స్టేను తెచ్చుకున్నారు.

తర్వాత 2019లో దేశవ్యాప్తంగా అన్ని స్టేలు సుప్రీంకోర్టు ఎత్తివేసిన క్రమంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టేను కూడా ఎత్తివేసారు. కేసు విచారణ కొనసాగింది. 2021లో లక్ష్మీ పార్వతి ఆరోపణలు నిరాధారమని ఏసీబీ కోర్టు కేసు కొట్టివేసింది. దీనితో వైసీపీ పార్టీ పక్షానికి చేరి చంద్రబాబుపై ప్రతీకారానికి ఎదురుచూస్తోంది.

పట్టు వదలకుండా చంద్రబాబును జైలుకు పంపడమే తన జీవితాశయమని పలుసార్లు చెప్పిన ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. తాజాగా ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. లక్ష్మీ పార్వతికి చుక్కెదురయ్యింది. కోర్టులో అభాసుపాలయ్యింది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీకేం అధికారం ఉందని కోర్టు ప్రశ్నించింది. ‘ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలంటూ’ వ్యాఖ్యానించింది. ఈ కేసును ఇంతకు ముందే హైకోర్టు కూడా కొట్టివేసింది. అన్నీ ఆలోచించే హైకోర్టు కొట్టివేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.