Home Page SliderNational

SRH  కొత్త కెప్టెన్ ఎవరంటే..?

Share with

ఇటీవల జరిగిన IPL-2024 ఆక్షన్‌లో ఆసీస్ క్రికెట్ ప్లేయర్ పాట్ కమిన్స్‌ను భారీ మొత్తం చెల్లించి SRH సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ IPL-2024 సీజన్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను నియమించాలని ఆ జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఎయిడెడ్ మార్ర్కమ్‌ను తప్పించి కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని SRH నిర్ణయించినట్లు సమాచారం. అయితే కెప్టెన్‌గా కమిన్స్‌కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని SRH ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. కాగా కమిన్స్ కెప్టెన్సీలోనే యాషెస్,WTC ఫైనల్ ,వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మరి కెప్టెన్‌గా ఇంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న కమిన్స్‌ను రూ.20కోట్ల భారీ మొత్తంతో సొంతం చేసుకున్న SRH ఈసారైనా IPL ట్రోఫీని దక్కించుకుంటుందో లేదో వేచి చూడాల్సివుంది.