Home Page SliderNational

ధోని తర్వాత CSK కెప్టెన్ ఎవరంటే…!

Share with

ఈ ఏడాది జరిగిన IPL సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో IPL ట్రోఫీని ఎవరు దక్కించుకుంటారనే అంశం కంటే ధోని ఎప్పుడు రిటైర్ అవుతారనే అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో CSK టీమ్ సభ్యుడు అంబటి రాయుడు CSK కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ధోని తర్వాత  CSK టీమ్‌ కెప్టెన్‌గా ఎవరు ఉంటారు అనే దానిపై అంబటి రాయుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోని తర్వాత CSK టీమ్ కెప్టెన్‌గా ఉండేందుకు కావాల్సిన అర్హతలు CSK టీమ్ సభ్యుడు రుతురాజ్ గైక్వాడ్‌కు పుష్కలంగా ఉన్నాయన్నారు.  కాగా ధోని కెప్టెన్సీలో రుతురాజ్ ఓ ఏడాదిపాటు శిక్షణ తీసుకుంటే..మరో పదేళ్ల పాటు టీమ్‌ను సమర్థవంతంగా నడిపించగలరు అని అంబటి తెలిపారు. భవిష్యత్తులో CSK టీమ్ కెప్టెన్‌గా రుతురాజ్‌కే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయన్నారు. అంతేకాకుండా రుతురాజ్ టీమిండియా తరుపున అన్ని ఫార్మాట్లలో ఆడతారని అంబటి రాయుడు వెల్లడించారు. కాగా రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే ఆసియా గేమ్స్‌కు వెళ్లే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు.