Andhra PradeshHome Page SliderTelangana

తెలుగు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతోంది… మద్దిరాల గ్రామంలో ”ఆరా పోల్ స్ట్రాటజీస్” ప్రెస్‌మీట్

Share with

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అంచనా వేయడంలో తిరుగులేని “రారాజు”గా పేరు పొందిన  “ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్” మేనేజింగ్ డైరెక్టర్ ‘ఆరా మస్తాన్’ గారు నేడు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు చిలకలూరిపేట మండలంలోని తన స్వగ్రామం మద్దిరాలలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో అని దేశవ్యాప్తంగా కుతూహలంగా ఉన్నారు ఓటర్లు. తెలంగాణలో పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ప్రభుత్వం కొలువుతీరబోతోందో అని ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు ఎదురుచూస్తున్నారు. ఫలితాలు  వెలువడడానికి ముందే అనేక సర్వే సంస్థలు నేడు తమ సర్వే రిపోర్టులను బహిర్గతం చేయబోతున్నాయి. వాటిలో నూటికి నూరుశాతం ఖచ్చితత్వంతో తమ ఎగ్జిట్ పోల్‌ను తెలియజేసే ఆరా సంస్థ సర్వే వివరాలపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వే ఫలితాలను తెలియజేయడానికి పెట్టిన ప్రెస్‌మీట్‌కు ప్రముఖ తెలుగు ఛానెల్స్‌కు ఇప్పటికే ఆహ్వానం అందజేశారు. ఈ సర్వే వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్‌లో మనసర్కార్ అందిస్తున్న వీడియోను చూసేయండి..