Home Page SliderNational

ఇన్ని వేలమంది ఒక్కడ్ని పట్టుకోలేకపోయారా?

Share with

ఇంతమంది కలిసి ఒక్కడిని పట్టుకోలేకపోయారని, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు పంజాబ్ పోలీసులకు చీవాట్లు పెట్టింది. 80 వేల మంది పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించింది. ఖలిస్తాన్ నాయకుడు, ‘వారిస్ పంజాబ్ దే’ లీడర్ ఐన అమృతపాల్ కోసం రాష్ట్రాన్ని జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అమృత్‌పాల్ కేసులో ఇప్పటికే 120 మందికి పైగా అరెస్టు చేశారు పోలీసులు. ఐసిస్ ఏజెంట్‌గా అనుమానిస్తున్న అమృత్‌పాల్ గత శనివారం సాయంత్రం కనిపించినట్లే కనిపించి మెరుపులా మోటార్ సైకిల్‌పై మాయమయ్యాడు. ఇక ఇప్పుడు పంజాబ్ నుండే తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. గత నెలలో అతని మద్దతు దారులలో ఒకరిని జైలు నుండి విడిపించే ప్రయత్నంలో కత్తులు, తుపాకులతో పోలీసు స్టేషన్‌లో ప్రవేశించారు అమృత్‌పాల్ అనుచరులు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. దీనితో అతని సంస్థ చర్యలపై విచారణలు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసే పనిలో పడ్డారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు వారి వ్యవహారాలన్నీ బయటపడ్డాయి.