Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా గెలిచినా ప్రయోజనమేంటి: కేసీఆర్

Share with

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు,ఉత్సాహం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. కాగా తెలంగాణా టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణాలో కూడా కర్ణాటకలో లాగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణా సీఎం కేసీఆర్ స్పందించారు. కర్ణాటక ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా గెలిచిన ఏం చేసిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని,ప్రజలు గెలవాలన్నారు. తెలంగాణా ఏర్పడిన అనతి కాలంలోనే అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. తెలంగాణాలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదని కేసీఆర్  ప్రశ్నించారు.