Home Page SliderNational

భారీగా పెరిగిన అల్లంవెల్లుల్లి ధర ఎంతంటే..!

Share with

ఇటీవల కాలంలో దేశంలో నిత్యావసరాల ధరలు వరుసగా పెరుగతూ సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి.కాగా మొన్నటి వరకు ఉల్లిపాయ ధరలు పెరిగి సామాన్యుల కంట కొనకుండానే కన్నీళ్లు తెప్పించాయి. అయితే నిన్న టమాటా ధర కేజీ ఏకంగా రూ.200 దాటి భయపెట్టాయి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ధరలు ఒకేసారి ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ అల్లంవెల్లుల్లి ధర రూ.250కి చేరింది. అయితే 2,3 నెలల క్రితం  అల్లంవెల్లుల్లి ధర రూ.120-150 మధ్య ఉంది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ వెల్లుల్లి ధర రూ.280 పలుకుతోంది. అయితే దేశంలో అల్లంవెల్లుల్లి సరఫరా తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగాయని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ వెల్లడించింది. కాగా నిత్యం పెరుగుతున్న ఈ ధరలతో దేశంలోని సామాన్యుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారయ్యింది.