Home Page SliderTelangana

సితార జ్యూవెలరీ యాడ్‌ రెమ్యూనరేషన్ ఎంతంటే..

Share with

ఇటీవల సూపర్‌ స్టార్ హీరో మహేష్ బాబు ముద్దుల తనయ ప్రిన్సెస్ సితార ఒక జ్యువెలరీ యాడ్‌లో నటించింది. దానిని అమెరికాలోని ప్రతిష్టాత్మక టైమ్‌స్వేర్‌లో ప్రదర్శించారు. గతంలో ఎన్ని యాడ్ ఆఫర్లు వచ్చినా మహేశ్ బాబు తన కుమార్తె చేయడానికి ఒప్పుకోలేదట. మహేశ్ ఫ్యామిలీ అందరూ ఒక యాడ్‌లో గతంలో నటించిన నాటి నుండి యాక్టివ్‌గా ఉన్న సితారకు ఎన్నో ఆఫర్లు వచ్చాయట. అప్పుడు ఒప్పుకోకపోయినా ఈ జ్యువెలరీ యాడ్‌కు సరేనన్నారు మహేష్. ఈ యాడ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలా ఆనందించారు మహేష్. సితారను టైమ్ స్క్వేర్‌లో చూసి చాలా గర్వంగా ఉందని, ఇంకా ఎన్నో విజయాలు అందుకుంటూ వెలిగిపోవాలి నా ఫైర్ క్రాకర్ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ యాడ్‌కు సితారకు అందిన రెమ్యూనరేషన్ వింటే కళ్లు తేలేయవలసిందే. ఇంత చిన్న యాడ్లో మొదటి సారి నటించిన సితారకు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేశారట ఆ యాడ్ కంపెనీ వారు. మహేశ్‌కు కూడా యాడ్స్‌కు ఇంత డబ్బు రాలేదంటున్నారు సన్నిహితులు.