Home Page SliderTrending Today

“RRR” హీరోస్‌కు ఏమైంది…?

Share with

ప్రపంచవ్యాప్తంగా “RRR”సినిమా ఓ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్‌తో సహా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరోలు రామ్‌చరణ్,ఎన్టీఆర్‌లు నిజజీవితంలో కూడా ఇలానే ఉంటామని వెల్లడించారు. అయితే ఇప్పుడు మాత్రం వీళ్లు ఎడ మొహం..పెడ మొహంగా ఉంటున్నట్లు కన్పిస్తోంది. దీనికి కారణం ఎంటో స్పష్టంగా తెలియనప్పటికీ వీరిద్దరి మధ్య మునుపటిలా సఖ్యత లేదని అర్దమవుతుంది. ఎందుకంటే ఆ మధ్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కలివిడిగా తిరిగి..సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు ఎన్టీఆర్,రామ్‌చరణ్.కానీ ఇప్పుడు ఒకరి ఇంట్లో జరిగే పార్టీలకు కూడా ఇంకొకరు హజరుకాకపోవడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. అయితే ఈ పార్టీలో ఎన్టీఆర్ ఎక్కడా కన్పించలేదు. అంతేకాకుండా ఆస్కార్ గెలిచిన సందర్భంగా ఎన్టీఆర్ కూడా నిన్న పార్టీ ఇవ్వగా..ఈ పార్టీలో రామ్‌చరణ్ లేకపోవడం గమనార్హం. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని సినీ వర్గాలు,అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై “RRR” బ్రదర్స్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.