Home Page SliderNational

సమంతలో నాగచైతన్యకు నచ్చేది ఏంటంటే..?

Share with

టావీవుడ్‌లో నాగచైతన్య,సమంత క్యూట్ కపుల్‌గా పేరు సంపాదించుకున్నప్పటికీ..ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. కాగా 2017లో అంగరంగ వైభవంగా పెళ్లిపీటలెక్కిన ఈ జంట 2019 లోనే ఆ పెళ్లిని పెటాకులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరు తమ కొత్త ప్రాజెక్టలతో బిజీగా ఉన్నారు. కాగా నాగచైతన్య తన కొత్త సినిమా “కస్టడీ” ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వూలో మీ కో యాక్టర్స్‌లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటీ? అని చైతూను యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా..సమంతలో హార్డ్ వర్క్,పూజా హెగ్దేలో స్టైల్,కృతి శెట్టిలో అమాయకత్వం తనకు నచ్చుతాయని చైతూ చెప్పారు. అయితే నాగచైతన్య,కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.