Andhra PradeshHome Page Slider

ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన 5 హామీలు ఏంటంటే..?

Share with

ఈ రోజు ఏపీలో ప్రారంభమైన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు సంతకం చేసిన 5 హామీలపై కేబినెట్ సభ్యులు చర్చించారు. అనంతరం ఏపీ మంత్రి వర్గం మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి ముందుగా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,పెన్షన్ రూ.3000/- నుంచి రూ.4000/-వేలకు పెంపు,అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ,నైపుణ్య గణన తదితర హామీలకు కూడా కేబినెట్ ఆమోదం ప్రకటించింది. అంతేకాకుండా విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.