Andhra PradeshHome Page Slider

తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాం:చంద్రబాబు

Share with

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిన్న  ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం చంద్రబాబు తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతో చేస్తానన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక విజయం అన్నారు.2003లో అలిపిరిలో తనను వెంకటేశ్వర స్వామే బ్రతికించారన్నారు.తాను రాష్ట్రానికి ఏదో చేయాలి కాబట్టే దేవుడు నన్ను కాపాడారన్నారు. ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో..ఆ సంపద పేద వాళ్లకు వెళ్లడం అంతే ముఖ్యమన్నారు. భారతీయులు, తెలుగుజాతి అత్యున్నత స్థానంలో ఉండాలన్నారు.ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉండాలన్నారు.మా పరిపాలనలో ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తామన్నారు. కాగా గత 5 ఏళ్లలో ఏపీ అపార నష్టం జరిగిందన్నారు. ఈ మేరకు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడం ఎప్పుడూ చూడలేదన్నారు.