Andhra PradeshHome Page Slider

ఏపీలో ఈ ఏడాదే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం:మంత్రి విడదల

Share with

ఏపీ రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని,వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన వైద్య కళాశాలల్లో ఈ ఐదు కాలేజీలకు ఎస్ఎంసీ నుంచి అనుమతి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సీట్లే కాకుండా, 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తీసుకువచినట్లు వివరించారు. రాష్ట్రంలో వందేళ్ల క్రితం 1923లో విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైందని. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి విడదల రజిని వివరించారు.