Andhra PradeshHome Page Slider

ఏపీలో త్వరలోనే 20 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం:మంత్రి నారాయణ

Share with

ఏపీలో ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మెగా డీఎస్సీ,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,పెన్షన్ల పెంపు ,అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ,స్కిల్ సెన్సస్ వంటి పలు హామీలపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో త్వరలోనే 20 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. కాగా మరో 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లను తెరుస్తామన్నారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్ల ఏర్పాట్ల కోసం రాజధానిలోని భవనాల దగ్గర ఉన్న తుమ్మ చెట్లను తొలగిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌పై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు.