Home Page SliderTelangana

తెలంగాణా రైతులను కడుపులో పెట్టి కాపాడుకుంటాం: కేసీఆర్

Share with

తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్రస్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం కేసీఆర్ ఇవాళ ముప్పు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాగా ఆయన దీనిపై తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణాలో దాదాపు 84 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగులో ఉందన్నారు. ఈ విధంగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయం సాగులో లేదన్నారు. తెలంగాణాలో రైతులకు ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు భీమా,రైతు బంధు,24 గంటల ఉచిత కరెంట్ అందిస్తుందన్నారు. తెలంగాణా అభివృద్దిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాబట్టి వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి నెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా తెలంగాణా రైతులకు కేంద్రం నుంచి నిధుల రానప్పటికీ ,రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే వారిని ఆదుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న  రైతులకు ఎకరానికి 10,000/- చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణాలోని రైతులు,కౌలు రైతులను ప్రభుత్వం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా అన్నీ విధాలా ఆదుకుంటుందని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.