Home Page SliderTelangana

మద్యం, డబ్బు పంచకుండా ఓట్లు సాధిస్తాం…రేవంత్ రెడ్డి

Share with

వచ్చే ఎన్నికలలో మద్యం, డబ్బు పంచకుండా ఓట్లు సాధిస్తాం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. గన్‌పార్క్‌లో తాను ప్రమాణం చేసి చెప్తానని, కేసీఆర్ ప్రమాణం చేయగలడా అని సవాల్ చేశారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజలను ప్రలోభపెట్టలేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికలలో, మునుగోడు ఎన్నికలలో వారే ప్రజలను మందు పేరుతో, డబ్బు పేరుతో ప్రజలను ప్రలోభ పెట్టారని ఎద్దేవా చేశారు. దేశంలో ఖరీదైన ఎన్నికలుగా ఆ నియోజక వర్గాలు రికార్డు కెక్కాయని పేర్కొన్నారు. అమర వీరుల స్థూపాన్ని రాష్ట్రప్రజలందరూ కులమతాలతో సంబంధం లేకుండా అందరూ గౌరవిస్తారని, అక్కడ ప్రమాణం చేద్దామని ఆహ్వానించారు. తాను నేడు అదే సమయానికి ఆ ప్రదేశానికి చేరుకున్నానని, కానీ కేసీఆర్ తనను పోలీసులతో అరెస్టు చేయించారని మండిపడ్డారు. ప్రజలను మళ్లీ ప్రజలను నట్టేట ముంచాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారని పేర్కొన్నారు. మీరు ఉద్యమ కారులైతే, తెలంగాణాపై గౌరవం ఉంటే, తన సవాల్ స్వీకరించాలని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ప్రజలకు కేవలం మద్యం పోసి, డబ్బులు పంచి, మత్తులో ముంచి ఓట్లు వేయించుకుంటున్నారన్నారు. పైగా ఎక్కడ ఏ రాష్ట్రంలో డబ్బు దొరికినా, అదిగో కాంగ్రెస్ వాళ్లవే అంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేము కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలతోనే ప్రజల్లోకి వెళ్తాం గెలిచి తీరుతాం అని పేర్కొన్నారు.