NationalNewsNews Alert

ఖాసీం చాచా’కు మేము ఉన్నాం – కన్నడ చిత్ర పరిశ్రమ

Share with

సినిమా ఇండ్రస్ట్రీలో బాక్సాఫిస్‌ రికార్డల్లను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన సినిమా కేజియఫ్(KGF). ఈ సినిమాలో ‘ఖాసీం చాచా’ అనే పేరు వినే ఉంటారు. అనాధగా ఉన్న హీరోని దగ్గరకు చేరదీసి చివరి వరకు హీరోకి తోడుగా నిలిచిన వ్యక్తి ఖాసీం చాచా. అయితే ఈ మూవీలో ఒక ముస్లిం వృద్దుడిగా బోల్‌ రే క్యా చాహీయే తేరేకో అంటూ నటించన చాచా అసలు పేరు హరీష్ రాయ్. తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినియర్ నటుడు ఇప్పడు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈయన ప్రస్తుతం కిడ్వాయి ఆస్పత్రిలో ట్రిట్మెంట్ తిసుకుంటున్నారు. చికిత్సలో భాగంగా అతని ఊపిరితిత్తులకు ఆపరేషన్ చేశారు, అయితే క్యాన్సర్ పూర్తిగా నయం కావడానికి మరింత చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. అయితే హరీష్ రాయ్ తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిందని, మిగిలిన ట్రీట్ మెంట్‌కి ఆర్థకంగా హెల్ప్ చేయమని వేడుకున్నాడు.

హరీష్ రాయ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాడు. ఎందుకలా చేశావని అడగ్గా… “మొదట్లో థైరాయిడ్ సమస్య ఉందని అనుకున్నాను. పరీక్షల అనంతరం క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. నాకు క్యాన్సర్ అని తెలిస్తే ఎవ్వరూ సినిమాల్లో అవకాశం ఇవ్వరని భయపడి ఎవరికి చెప్పలేదన్నారు. నాకు డబ్బులు కావాలి. కానీ నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నందున, నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి సినిమా నుండి దూరం చేస్తారనే భయంతో నేను అలా చేసాను” అని హరీష్ రాయ్ కంటతడి పెట్టారు. ఇంతలో, KGF నటుడి దుస్థితి గురించి తెలుసుకున్న కన్నడ చిత్ర పరిశ్రమ నుండి చాలా మంది నటులు, నిర్మాతలు మరియు దర్శకులు అతనికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. హరీష్ త్వరగా కోలుకుని మళ్లీ ఆయన సినిమాల్లో నటించగలరని ఆశిస్తున్నాను.