Home Page SliderInternational

థ్రెడ్స్ యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. కమ్మిన్స్ ఏమన్నాడంటే..?

Share with

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటకర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా ట్విటర్‌కు పోటీగా మెటా అందుబాటులోకి తీసుకొచ్చిన “థ్రెడ్స్” యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను థ్రెడ్స్ యాప్‌లోకి వచ్చినట్లు తన తోటి టీమ్ సభ్యుడైన పాట్ కమ్మిన్స్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. కాగా దీనిపై పాట్ కమ్మిన్స్ స్పందించారు. దయచేసి ఇక్కడైనా డ్యాన్స్ వీడియోలు అప్లోడ్ చేయకండి అని రిప్లై ఇచ్చారు. అయితే ఈ రిప్లైకి బెస్ట్ అడ్వైస్ బ్రో అంటూ టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కామెంట్ చేశారు. కాగా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యారు. ఆ తర్వాత పుష్ప సినిమా డైలాగులతో కూడా వార్నర్ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేశాడు. ఈ విధంగా డేవిడ్  డేవిడ్ వార్నర్ తన ఆట కంటే కూడా డ్యాన్స్ వీడియోలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు.