Andhra PradeshHome Page Slider

ముగిసిన విశాఖ టెండర్ల గడువు ..మరి సింగరేణి పాల్గొందా?

Share with

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటీవల EOI కోసం టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా ఈ టెండర్ల గడువు నేటితో ముగిసింది.అయితే ఈ టెండర్లలో దాదాపు 22 కంపెనీలు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. దీనిలో టెండర్లు వేస్తామని అధికారికంగా ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం మాత్రం టెండర్లు వేయలేదని తెలుస్తోంది.కాగా ఈ టెండరు వేస్తామని ఓ రెండు రోజులపాటు సాధ్యసాధ్యాల పరిశీలన కోసం సింగరేణి అధికారులను సీఎం కేసీఆర్  విశాఖకు పంపించారు. దీంతో 2 రోజులపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ టెండర్ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదికను కూడా సమర్పించారు. మరి ఇన్ని కసరత్తులు చేసిన సింగరేణి అధికారులు టెండర్ వేయకుండా ఎందుకు వెనుదిరిగారో తెలియాల్సివుంది.