Home Page SliderNational

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విజయ్ “లియో “

Share with

తమిళ స్టార్ హిరో దళపతి విజయ్ నటించిన “లియో” సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా  రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో రూ.24కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిందని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది.ఈ సినిమా విడుదలైన తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.148.5 కోట్లు వసూలు చేసినట్లు  సమాచారం. విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో విజయ్‌కు జంటగా త్రిష నటించారు. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్,అర్జున్ సర్జా,గౌతమ్ వాసుదేవ్ మేనన్,ప్రియానంద్ కీలక పాత్రలు పోషించారు.