Andhra PradeshHome Page Slider

తిరుమలలో అపచారం-విజిలెన్స్ దర్యాప్తు

Share with

కలియుగ వైకుంఠధామమైన శ్రీవేంకటేశ్వరుని ఆలయం తిరుమల దేవస్థానంలో ఒక అపచారం జరిగింది. ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌తో లోనికి ప్రవేశించడమే కాకుండా, సాక్షాత్తూ మూల విరాట్టు కొలువుతీరిన ఆనందనిలయం గోపురాన్నే కెమెరాతో వీడియో తీసాడు. వర్షం పడుతుండగా ఆనంద నిలయం వీడియో, విమాన వేంకటేశ్వర స్వామికి భక్తులు మొక్కుతున్నవీడియోలు, ధ్వజస్తంభం వీడియోలు సోషల్ మీడియోలో  వైరల్ అవుతున్నాయి. దీనితో అప్రమత్తమయ్యింది టీటీడీ విజిలెన్స్ విభాగం. ఈ ఘటనపై విజిలెన్స్ వైఫల్యానికి కారణం ఎవరో ఆరాతీసే పనిలో పడింది. మొబైల్ తీసుకెళ్లిన భక్తుడిని సీసీ టీవీలలో గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమల ఆలయ నియమం ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో సెల్‌ఫోన్లను అనుమతించరు. అందువల్ల ఇది భద్రతా సిబ్బంది వైఫల్యమే అని భావిస్తున్నారు.