Home Page SliderNational

వీరూ నీ బర్త్ డే బోరింగ్‌గా జరుపుకో.. సచిన్ వెరైటీ విషెస్

Share with

ఇవాళ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వగ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ వినూత్న రీతిలో వీరూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “క్రీజులో ఉండు,స్లోగా ఆడు అని నేను చెబితే ,సరేనని తలూపి ఆ తర్వాతి బాల్‌నే బౌండరీ కొడతాడు. నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా చేసే ఆ మనిషికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ పుట్టిన రోజును చాలా బోరింగ్‌గా గడుపు వీరూ” అని సచిన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ వీరెేందర్ సెహ్వాగ్ తన అత్యుత్తమ బ్యాటింగ్‌తో టీమిండియాని ఎన్నో మ్యాచుల్లో గెలిపించారు.కాగా సెహ్వాగ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్‌గా పేరుపొందాడు.