Home Page SliderNational

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న టమాటా ధరలు

Share with

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో టమాటా దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో మేలు రకం టమాటాకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.80/-లుగా ఉంది. అయితే మార్కెట్‌లో మిగతా కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. కాగా పెరిగిన కూరగాయల ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.