Home Page SliderNational

పెళ్లితో ఒక్కటి కాబోతున్న వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి

Share with

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నాయని సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎవరు స్పందించలేదు. దీంతో ఇవి పుకార్లు మాత్రమే అని అందరు అనుకుంటున్న వేళ.. వీరిద్దరు ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ వార్తలు నిజమయ్యాయి. హీరో వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా రేపే వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు అఫీషియల్‌గా ఓ ప్రకటన విడుదలైంది. కాగా Two Hearts One Love..ఇద్దరు జీవింతాతం సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రీటింగ్ కార్డ్‌ను సినీ వర్గాలు ట్వీట్ చేస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే లావణ్య సూపర్‌హిట్ అందుకున్నారు. దీంతో ఆమె టాలీవుడ్ టాప్ హీరోస్‌తో జతకట్టారు. కాగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌తో కలిసి అంతరిక్షం, మిస్టర్ సినిమాల్లో నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరి ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.