InternationalNews

అమెరికా చెత్త వీసా రూల్స్

Share with

అమెరికా అనాలోచితం…
నత్తనడకన భారతీయులకు వీసా జారీ పక్రియ
యూఎస్ వీసా కోసం ఇండియన్లకు రెండేళ్లు
చైనీయులకు రెండు రోజులు
ఇండియా కంటే పాకిస్తాన్‌కు బెటర్‌గా సేవలు

భారతీయ వీసా దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ పొందేందుకు రెండేళ్లకు పైగా వేచి ఉండాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్ చూపిస్తోంది. అదే సమయంలో చైనా వంటి దేశాలకు కాలపరిమితి రెండు రోజులు మాత్రమేనట. సందర్శకుల వీసాల కోసం ఢిల్లీ నుండి దరఖాస్తుల కోసం 833 రోజులు, ముంబై నుండి 848 రోజుల అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సి ఉందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ చూపిస్తోంది. ఇండియా పరిస్థితి ఇలా ఉంటే చైనా విషయంలో మాత్రం అమెరికా అసలు రంగు బయటపడింది. చైనీయులు వీసా కోసం రెండు రోజులు వెయిట్ చేస్తే చాలట… పాకిస్తాన్‌కు సైతం 450 రోజులు మాత్రమేనట.

స్టూడెంట్ వీసాల కోసం, ఢిల్లీ, ముంబైకి 430 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఆశ్చర్యకరంగా, ఇది ఇస్లామాబాద్‌కు ఒక రోజు, బీజింగ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం పడుతోందంటోంది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్.

అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్… ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో వీసా దరఖాస్తుల బ్యాక్‌లాగ్ సమస్యను లేవనెత్తారు. ఐతే సమస్య ప్రపంచం వ్యాప్తంగా ఉందని… కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. భారత్ నుంచి వీసా దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించేందుకు అమెరికా ప్రణాళికను సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. రాబోయే నెలల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు. వీసా ప్రెసెసింగ్‌పై బైడెన్ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో తక్కువ దరఖాస్తుల కారణంగా వీసా ప్రక్రియను నిర్వహించే సిబ్బందిని తగ్గించడంతో బ్యాక్‌లాగ్ ఏర్పడిందని అమెరికా అంటోంది. కోవిడ్ కాలంలో స్టూడెంట్, టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తులు పెరగడం, వారికి తగిన సిబ్బంది లేనందున బ్యాక్‌లాగ్‌ ఎక్కువైందంటోంది అమెరికా.

కరోనా సమయంలో… భారతదేశంలోని ప్రజల కోసం అమెరికా మిషన్ తెరిచి ఉన్నప్పటికీ, లాక్డౌన్లు, సామాజిక దూర అవసరాలతో సహా స్థానిక పరిమితుల ద్వారా రోజుకు వసతి కల్పించే దరఖాస్తుదారుల సంఖ్య పరిమితం చేయబడిందని యుఎస్ ఎంబసీ ప్రతినిధి క్రిస్ ఎల్మ్స్ చెప్పారు. మొదటిసారి, ఒకసారి అమెరికా వెళ్లి వచ్చి తిరిగి వెళ్లాలనుకునేవారి కోసం అన్ని రకాల ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభించామన్నారు. ఈ వేసవిలో విద్యార్థులు తగిన సమయానికి వీసాలు అందించామని… 82,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాల జారీ చేశామన్నారు. ఫలితంగా, ఇతర దేశాల కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఈ సంవత్సరం USకి వెళుతున్నారని చెప్పారు. ఇండియాలోని అన్ని మిషన్లలో సిబ్బంది సేవలను అత్యున్నతస్థాయికితీసుకెళ్లేలా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు చేసిందన్నారాయన. కొత్త అధికారులను నియమించడం, శిక్షణ ఇవ్వడం, కాన్సులర్ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుందని, రాబోయే నెలల్లో హైదరాబాద్‌లో కొత్త విస్తరించిన సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. కన్సులర్ టీమ్ ఇండియా సైతం వీసా జారీ ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచే కొత్త అధికారాలను ఉపయోగించుకుంటుందని… గతంలో జారీ చేసిన దరఖాస్తుదారుల కోసం ఇంటర్వ్యూ మినహాయింపు అమలవుతుందని… వచ్చే రోజుల్లో ఇప్పటి వరకు ఉన్న దరఖాస్తులు పదివేలకు… అపాయింట్‌మెంట్‌లు జారీ చేయాలని అమెరికా ఎంబసీ ప్రతినిధి క్రిస్ ఎల్మ్స్ చెప్పారు.