InternationalNews Alert

చైనా విమానాలకు అమెరికా చెక్‌.. ఎందుకంటే ?

Share with

కొవిడ్‌ కేసుల నేపథ్యంలో అమెరికా ప్రయాణికుల విమానాలను ఇటీవల చైనా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే చైనా తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ అమెరికా కూడా చర్యలు చేపట్టింది. చైనాలోని నాలుగు విమానయాన సంస్థలకు చెందిన 26 విమానాల రాకపోకలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది.


జియామెన్, ఎయిర్ చైనా, చైనా సదరన్ ఎయిర్ లైన్స్, చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన 26 విమానాలను సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 28 వరకు నిలిపివేయనున్నట్టు పేర్కొంది. విమానయాన ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని అమెరికా రవాణా సంస్థ పేర్కొంది. ప్రయాణికులకు కొవిడ్‌ ఉందని విమానాలను రద్దు చేయడం సరైన చర్య కాదని అమెరికా ప్రభుత్వం చెప్పింది. ప్రయాణికులకు బయలుదేరే ముందు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితం వస్తోందని.. చైనాలో దిగాక పరీక్షలు నిర్వహించినప్పుడు పాజిటివ్‌ ఫలితం రావడంతో విమానయాన సంస్థలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. చైనా ఇలానే నిబంధనలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది