Home Page SliderInternational

ఉక్రెయిన్‌కు హ్యాండిస్తున్న అమెరికన్ కాంగ్రెస్

Share with

ఉక్రెయిన్‌కు అంతులేని మద్దతునిచ్చే అమెరికా అధ్యక్షుడు బైడన్ మాట మార్చారు. చేయగలిగినంత సాయం మాత్రమే చేయగలమంటూ ఉక్రెయిన్‌కు హ్యాండిచ్చారు.  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాతో యుద్ధానికి కావల్సిన నిధుల కోసం మరోసారి అమెరికా గడప తొక్కారు. అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశమయ్యారు. ప్రతీసారి ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ఎలాంటి మద్దతునైనా ఇస్తామని హామీ ఇచ్చిన బైడెన్, అమెరికా కాంగ్రెస్‌లో సొంతపార్టీవారే వ్యతిరేకించడంతో వెనుకంజ వేశారు. కేవలం 20 కోట్ల డాలర్ల ప్రస్తుత సాయం మాత్రమే చేయగలమన్నారు. తమకు అమెరికా నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము యుద్ధాన్ని ఆపేది లేదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ సభ్యులు కూడా అమెరికాకు లేఖ రాసారు. యుద్ధంలో ముందుండే యోధుల కోసం సహాయం చేయాలని, రష్యా బలపడితే అమెరికా, యూరోప్ దేశాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తాము పైచేయి సాధించినట్లు రష్యా గమనించింది. దీనితో శాంతి చర్చలకు ఉక్రెయిన్ ముందుకు వస్తే అంగీకరించే అవకాశం ఉంది. అంతులేని యుద్ధం ఎవరికీ మంచిది కాదనే విషయం జెలెన్‌స్కీ తెలుసుకోవాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి.