Andhra PradeshHome Page Slider

స్టీల్‌ప్లాంట్ బిడ్లకు అనూహ్యస్పందన-  రేసులో జేడీ లక్ష్మీనారాయణ

Share with

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పిలిచిన టెండర్లకు అనూహ్యస్పందన లభించింది. ఇప్పటికే 22 కంపెనీలు బిడ్లు వేశారు. ఒక ప్రవేట్ కంపెనీ ద్వారా సీబీఐ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ కూడా బిడ్ వేశారు. బడా కంపెనీలన్నీ దరకాస్తు చేసుకున్నారు. సింగరేణి తరపున తెలంగాణా ప్రభుత్వం కూడా బిడ్ వేసింది. లక్ష్మీనారాయణ క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బు వసూలు చేసి, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానాయకులు దివిసీమ తుఫాను సమయంలో క్రౌడ్ ఫండింగ్ చేశారని, ఇప్పుడు ఈ పరిశ్రమను కాపాడుకోవాలంటే తెలుగు ప్రజలంతా నెలకు తలొక 100 రూపాయలు ఇస్తే చాలని ఆయన పేర్కొన్నారు. 850 కోట్ల రూపాయలు ఉంటే నెలకు సరిపోతుందని, తెలుగు ప్రజలంతా సహకరిస్తే మన స్టీల్ ప్లాంట్ మనదేనన్నారు. న్యాయంగా, స్వచ్ఛంగా ప్రజలు ఇచ్చే డబ్బుతో మన పరిశ్రమ నిలబడుతుందన్నారు. ఈ బడా కంపెనీల నడుమ ఈ ప్రవేట్ కంపెనీ పనిచేస్తుందా అన్న ప్రశ్నకు, తమ కంపెనీ వామనమూర్తి లాంటిదని, తప్పకుండా మూడడుగులతో వామనుడు విశ్వాన్ని ఆక్రమించినట్లు స్టీల్‌ప్లాంట్‌ను  తమ కంపెనీ దక్కించుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.