Home Page SliderInternational

‘పుతిన్ నియంత అనే కారణంతో ఉక్రెయిన్ మంచిదని చెప్పలేం’…అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీదారు

Share with

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న భారతీయ సంతతి వ్యక్తి  వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ నియంత అనే ఒకే ఒక్క  కారణంగా ఉక్రెయిన్ మంచిదని చెప్పలేమని వ్యాఖ్యానించారు. అమెరికా నుండి ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో నిధులు అందడాన్ని తప్పుపట్టారు. ఇటీవల ఎన్నికల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిధులు అర్థించారు. జెలెన్‌స్కీ గతవారమే నాజీ సైనికుడుని ప్రశంసించారని గుర్తు చేశారు. అమెరికా నుండి నిధులు రాకపోతే ఎన్నికలను నిర్వహించనని హెచ్చరించారు.  తాను అమెరికా అధ్యక్షుడైతే ఉక్రెయిన్ నిధుల్లో కోత విధిస్తానని తెలియజేశారు. అమెరికా ఉక్రెయిన్ విషయంలో మరీ గారాబం చేయడం తనకు నచ్చలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు 11 ప్రతిపక్ష పార్టీలను నిషేధించిందని, మీడియా సంస్థలన్నింటినీ ప్రభుత్వ మీడియాగా మార్చేసిందని విమర్శించారు. తానెవరో 6 నెలల ముందు వరకూ ఎందరో అమెరికన్లకు తెలియదని, కానీ ఇప్పుడు జాతీయ సర్వేలలో మూడవ స్థానానికి వచ్చానని తెలియజేసారు. మనకు అన్నింటికంటే అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని, అగ్రరాజ్యంగా స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. తాను మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలను నిర్మించానని, ఇప్పుడు శ్వేతసౌధంలో మంచి బిజినెస్ మ్యాన్ ఉండాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఒక కంపెనీ సీఈవోగా ఉండాలని అప్పుడే ఆర్థిక వృద్ధి సమస్యను పరిష్కరించగలమని వివరించారు. బైడెనామిక్స్ వలన ధరలు పెరిగాయని, కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.