Andhra PradeshHome Page Slider

జగనే వెన్నుపోటు పొడిచాడన్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి

Share with

సీఎం జగన్మోహన్ రెడ్డే తనను వెన్నుపోటు పొడిచారన్నారు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మర్యాదలేకుండా పార్టీలో ఇన్నాళ్లూ ఉన్నానన్నారు. గన్‌మెన్‌లకు ఉన్న విలువ కూడా లేకుండా పోయిందన్నారు. ఎక్కువ చేసినవారిని దేవుడు కత్తిరిస్తాడన్నారు. చంద్రబాబుతోనూ, బీజేపీతోనూ తాను ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని.. పార్టీ చెప్పిన వ్యక్తికే ఓటేశానన్నారు. రమణ అనే వ్యక్తికి తాను ఓటేశానన్నారు. తాను ఓటేసిన వ్యక్తి ఎమ్మెల్సీగా విజయం సాధించారన్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు చాలా సంతోషమన్నారు. బరువు బాధ్యతలు తీసేయడంతో ఫ్రీ బర్డ్ అయ్యానన్నారు. చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు.

ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే గెలిచానని.. అంతకంటే ఇంకేం కావాలన్నారు. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తే.. ఆదరిస్తారు.. లేదంటే లేదన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఈ టర్మ్ పూర్తి చేస్తానన్నారు. ఎవరు పిలిచినా తాను వెళ్లి మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు మేకపాటి చంద్రమోహన్ రెడ్డి. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలిస్తానన్నారు. 20 కోట్లకు అమ్ముడుపోయానంటూ సజ్జల చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. 20 కోట్లు ఇచ్చి ఉంటే ఏ దేవుని వద్ద ప్రమాణం చేయమన్నా చేస్తానన్నారు. కావాలంటే సజ్జల ప్రమాణం చేసేందుకు రావాలన్నారు. ధర్మం, న్యాయం, మానవత్వం అన్నీ ఉండాలన్నారు.

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రకృతి చూస్తుందన్నారు మేకపాటి. ప్రకృతి ఉంది. సృష్టి ఉంది. కచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందన్నారు. ఎవరినైనా కత్తిరిస్తుందన్నారు. ఎవరైనా మానవత్వ భావాలతో ఉండాలన్నారు. మర్యాదగా ఉండటం తెలుసుకోకపోతే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అవమాన పాలవుతారన్నారు. చంద్రబాబుతోనూ, ఇంకొకరితోనైనా అవసరమైనప్పుడు మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.